గంగలో స్నానం చేస్తుండగా.. గ్యాంగ్‌రేప్ - MicTv.in - Telugu News
mictv telugu

గంగలో స్నానం చేస్తుండగా.. గ్యాంగ్‌రేప్

October 3, 2018

దేశం అత్యాచారాల నిలయంగా మారిపోతోంది. స్కూళ్లు, గుళ్లు, రోడ్లు, ఇళ్లు..= అన్నిచోట్లా కామాంధులు దారుణాలకు తెగబడుతున్నారు. పవిత్ర గంగానదిలో స్నానానికి వెళ్లిన ఒక మహిళపై ఇద్దరు దుర్మార్గులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Bihar Woman Allegedly Gangraped by Two Men While She Was Bathing in Ganga River.

బిహార్ రాజధాని పాట్నాలో సోమవారం ఈ అకృత్యం జరిగింది. నదిలో స్నానం చేస్తున్న మహిళను శివపుజాన్ మెహతో, విశాల్ అనే యువకులు దాడి చేసి, తర్వాత గట్టుపైకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పవిత్ర గంగానదిలో ఈ పాపం తగదని ఆమె వేడుకున్నావారు విడిచిపెట్టలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో, ఇతర అశ్లీల వెబ్ సైట్లలో పెట్టారు. దీనిపై కేసు నమోదు చేశామని, అయితే బాధితురాలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు. లారీ డ్రైవరుగా పనిచేస్తున్న మహెతో ఓ మైనర్ బాలికను నిర్బంధించాడని, ఆమెను విడిపించామని వెల్లడించారు.