పెళ్లికార్డుతో వెళితే 25 కిలోల ఉల్లి.. ధర రూ. 35 మాత్రమే..! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికార్డుతో వెళితే 25 కిలోల ఉల్లి.. ధర రూ. 35 మాత్రమే..!

November 23, 2019

మార్కెట్లో ఉల్లిధరలు వినియోగదారుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. భారీగా పెరిగిన ధరల కారణంగా వాటిని కొనాలంటేనే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం నలుగురు ఉండే ఇంటికే ఉల్లి కొనలేని పరిస్థితి ఉంటే పెళ్లిలు, శుభకార్యాలు చేసేవారు వంటల  కోసం ఎక్కువ మొత్తంలో ఉల్లి తేవాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ధరల కారణంగా తాము ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నారు. అలాాంటి వారి కోసం కూడా బిహార్ ప్రభుత్వం ఊరట కలిగించే వార్తను వినిపించింది. 

Bihar Govt.

ఉల్లి కొరత పరిస్థితులను అదిగమించేందుకు బిహార్ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అక్కడి కార్పొరేట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఉల్లిని తక్కువ ధరకే అందిస్తున్నారు. ఇప్పటికే అక్కడి మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.75 ఉండగా.. ప్రభుత్వం రూ. 35 కే రెండు కిలలో వరకు అందిస్తోంది. పెళ్లి కార్డుతో వచ్చిన వారికి అదే ధరకు 25 కిలోల ఉల్లి అందిస్తున్నారు. పెళ్లిలు, శుభకార్యాలు చేసుకునే వారికి ఉల్లి కొనుగోలు భారం కాకుండా ఉండేందుకు ఈ విధంగా చేశామని అధికారులు చెబుతున్నారు. ఉల్లి కొనుగోలు చేసేవారు ముందుగా తమ పేరు, ఫోను నంబరు నమోదు చేసుకోవాల్సివుంటుంది.

ప్రభుత్వం అందిస్తున్న రాయితీ ఉల్లి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. స్టాల్స్ వద్ద భారీగా ప్రజలు క్యూలైన్లలో కనిపిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొందరగా ధరలు అదుపులోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.