Bihar: Grooms Get Sold in Market for Potential Brides in 700 Yrs Old “Groom Market”
mictv telugu

సంతలో పెళ్లికొడుకులు… చెక్ చేసుకుని కొనుక్కోవచ్చు!

August 10, 2022

ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం పెళ్లిళ్లు.. పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడడంతోనే మొదలవుతున్నాయి. అమ్మాయి నచ్చితే ఓకే చేసుకోవడం, ఆ తర్వాత జరిగే తతంగం అంతా అబ్బాయి తరపువారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడైతే పెళ్లి చూపుల సంప్రదాయం ఉంది కానీ ఒకప్పుడు స్వయంవరం అనే కాన్సెప్ట్ ఉండేది. అమ్మాయి తనకు కాబోయే వరుడిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండేది. అయితే ఈ రోజుల్లో కూడా అలాంటివి ఉంటే బాగుండు అనుకునే వారు చాలామందే ఉంటారు. బీహార్‌లోని మధుబని జిల్లాలో గత 700 ఏళ్లుగా అలాంటి సాంప్రదాయం ఒకటి నడుస్తున్నది.

అమ్మాయే తనకు కావాల్సిన వరుడిని సెలక్ట్ చేసుకోవడం అనేది మామూలుగా జరిగేదే. కానీ పెళ్లి కాని అబ్బాయిలు అందరూ ఒకేచోట ఉండగా.. వారిలో తనకు ఎవరు నచ్చితే వారిని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం అనేది కాస్త డిఫరెంట్ కదా. బీహార్ మధుబనిలో జరిగేది అదే. దీన్నే వారు సౌరత్‌ సభా అని పిలుస్తారు. దీంట్లో మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు పాల్గొంటారు. సౌరత్ సభలో పెళ్లి కాని అబ్బాయిలు ఒకేచోట కనిపిస్తారు. ఇక వారి సంపాదన, ఆస్తి వివరాలను బహిరంగంగానే చెప్తారు. అక్కడికి వచ్చిన అమ్మాయిలు.. అబ్బాయి నచ్చితే ఇరువురి కుటుంబ సభ్యులు తరువాతి కార్యక్రమాలను చూసుకుంటారు. ఏడాదికి ఎన్నో వేలమందిని ఒక్కటి చేసింది ఈ సౌతర్ సభా.

కాగా, స్థానికుల కథనం ప్రకారం.. ఈ సంప్రదాయం కర్నాట్ రాజవంశస్థుల కాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నారు. వివిధ గోత్రాల వ్యక్తుల మధ్య వివాహాలను సులభతరం చేయడానికి రాజా హరిసింగ్ ఈ మార్కెట్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇందులో వరకట్న రహిత వివాహాలు చేయడం మరో లక్ష్యం. అయితే, ప్రస్తుతం పెళ్లిల్లో కట్నం ఇవ్వడం, తీసుకోవడం కామన్ అయిపోయిందని, ఈ సంప్రదాయ మార్కెట్ ఎంచుకునే వరుడికి కూడా కట్నం ఇస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.