నాశాపం వల్లే లాలూకు కష్టకాలం...! - MicTv.in - Telugu News
mictv telugu

నాశాపం వల్లే లాలూకు కష్టకాలం…!

July 19, 2017

ఓ దిక్కు పశువుల దాణా కుంభకోణం కేసు,ఇంకో దిక్కు  సిబిఐ వాళ్ల మెరుపు దాడులు,తన మీదనే గాకుంట ఇంటోళ్ల మీద కేసులు..మూడు సోదాలు ఆరు ఇన్వెస్టిగేషన్లతోని పాపం లాలుసారుకు  పరిస్ధితులన్ని పగవట్టినయ్ అన్కోరాదున్రి,తిందామంటే తిండి పెయ్యిన వట్టకుంట,పందామంటే  కునుకు లేకుంట లాలూ ప్రసాద్ యాదవ్ మొత్తంమీద మన్సున వట్టకుంట జేస్తున్నరు బీహార్ సర్కారోళ్లు,శేనేశ్వరుడు సక్కగచ్చి  లాలూ నెత్తిమీదనే కూసున్నట్టున్నడు అన్కుంటున్రు గదా  కనీ లాలూ సార్కు వర్సగ వస్తున్న గీ కష్టాలకు అస్సలు కారణం..గీమె శాపమేనట,ఈమె పేరు షబ్నమ్ మౌసీ బనో..ఈమె ఒక ట్రాన్స్ జెండర్, 1998ల మధ్యప్రదేశ్ ల ఇండిపెండెంట్ గ పోటీజేసి  ఎమ్యేల్యేగ గెలిశింది,

దేశంలోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాన్స్‌జెండర్‌ గుడ ఈమెనే.అయితే 2008 ల మల్లా పోటీ జేశేటప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్ధిక సాయం చేస్తనని మాటిచ్చి..ఉత్త శెయ్యి జూపిచ్చిండట,అప్పుడు సాయం చేస్తనని చేయకపోవడంవల్లే తను ఓడిపోయ్న, అంతేకాదు  ఓసారి లాలూను దిల్లీలో కలిస్తే ఆయన తన ఓటమిపై వెకిలిగా మాట్లాడారని, తనకు ఛార్జీలు, ఖర్చుల కోసం ఓ పది వేల రూపాయలు ఇచ్చి పంపండని ఆయన మనుషులతో అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు,అందుకే నేను శాపం బెట్టిన..నా శాపం ఫలించి లాలూకు  కష్టకాలం మొదలైంది అని  చెప్పుకచ్చింది. షబ్నమ్‌ జీవితగాథ ఆధారంగ 2005లో  ‘షబ్నమ్‌ మోసీ’ పేరుతో హిందీల సిన్మగుడ వచ్చింది.

 

.