కరోనా ఘోరం.. అధికారులకు చెప్పాడని కొట్టి చంపారు..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఘోరం.. అధికారులకు చెప్పాడని కొట్టి చంపారు.. 

March 31, 2020

Bihar Man Beaten as he gave information on Maharashtra Returnees 

దేశంలో కరోనా మరణాలతోపాటు కరోనా పరోక్ష మరణాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా అనుమానంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని చోట్ల ఘర్షణల వల్ల హత్యలు కూడా సాగుతున్నాయి. ఊరిప్రజలను కాపాడుకోడానికి కరోనా హెల్ప్ సెంటర్‌కు సమాచారం అందించిన ఓ యువకుడిని ఇద్దరు దారుణంగా కొట్టి చంపారు. బిహార్‌లోని సీతామర్హి జిల్లా మధౌల్ గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది. 

గ్రామానికి చెందిన ఇద్దరు ఇటీవల మహారాష్ట్ర నుంచి ఇళ్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం తెలిసిందే. గ్రామానికి బయటి నుంచి ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతుండడంతో బబ్లూ అనే యువకుడు కరోనా హెల్ప్ సెంటర్‌కు సమాచారం అందించారు. దీంతో అధికారులు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరి రక్త నమూనాలను తీసుకెళ్లి, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ ఇద్దరు ‘రోగులు’ బబ్లూపై దాడి చేశారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమైన బబ్లూను ముజర్ఫూర్‌కు తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. పోలీసులు ఇద్దరు నిందితులతోపాటు మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.