ముందుల కోసం వెళ్లి మెడికల్ షాపు ముందే ప్రాణాలు వదిలాడు - MicTv.in - Telugu News
mictv telugu

ముందుల కోసం వెళ్లి మెడికల్ షాపు ముందే ప్రాణాలు వదిలాడు

July 16, 2020

Bihar Man Collapsing Medical Shop Outside

మందులు కొనేందుకు మెడికల్ స్టోరుకు వచ్చిన ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన బిహార్‌లోని భాగల్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. కరోనా భయంతో అతని మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు ఆరు గంటల పాటు ఆ శవం అక్కడే పడి ఉంది. వైద్య సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చినా లాభం లేకపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

ఆస్తమాతో బాధపడుతున్న ఓ రోగి మెడికల్  షాపునకు వెళ్లాడు. మందులు తీసుకుంటూనే కుప్పకూలాడు. వెంటనే షాపు యజమాని అతన్ని పరిశీలించగా ప్రాణాలు వదిలినట్టు తేలింది. కరోనా అనుకొని ఎవరూ అతన్ని తాకేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ షాపు ముందే దాదాపు ఆరుగంటల పాటు మృతదేహాం పడి ఉంది. కోవిడ్ కేర్ హెల్ప్ లైన్  సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదు. చివరకు డిప్యూటీ మేయరు జోక్యంతో పీపీఈ కిట్లు ధరించిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.