Home > Featured > తన తద్దినం తనే చేసుకున్న పెద్దాయన

తన తద్దినం తనే చేసుకున్న పెద్దాయన

చనిపోయాక పెద్దల ఆత్మల శాంతి కోసం తర్పణాలు, తద్దినం వంటివి చేస్తుంటారు. కొందరైతే కాశీ, గయల్లో అలాంటివి చేస్తే మరింత పుణ్యమని అక్కడికి వెళ్తుంటారు. శ్రాద్ధాలు, తద్దినాల విందులు చనిపోయేవాళ్లకే చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓ పెద్దాయన తన తద్దినం తనే చేసుకున్నాడు. బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాకు చెందిన భారతీపూర్‌ గ్రామవారి హరిచంద్ర దాస్‌ వయసు 75 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో ఆయన ఇలా వార్తల్లోకి ఎక్కాడు. తన తద్దినం తనే చేసుకున్నాడు. ఇది ఆయనకు రెండో తద్దినం. ‘‘నేను చనిపోతే నా కొడుకులు నాకు దినాలు చేయరేమోనని అనుమానం. చేయకపోతే ఆ ఆత్మకు విముక్తి ఉండదు. అందుకే నే అబ్దికాన్ని నేనే పెట్టుకుంటున్నా’’ అని చెప్పాడు పెద్దాయన.

హరిశ్చంద్ర దాస్ గత ఏడాది ఆయన తొలి తద్దినం చేసుకున్నాడు. హరిచంద్రకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన దినకర్మ చేయాలని అప్పట్లో ఇంట్లోవాళ్లను అడగ్గా వాళ్లు అందుకు నిరాకరించారు. అతడు పట్టుబట్టడంతో ఒప్పుకుని వంటలు అవీ చేసిపెట్టగా ఆయనే తద్దినం చేసుకున్నాడు. ఈ సారి కూడా అదే తంతు జరిగింది. సంప్రదాయాల ప్రకారం శ్రాద్ధం పెట్టుకుని, బంధుమిత్రులకు విందు ఇచ్చాడు.

Updated : 7 Nov 2022 2:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top