Bihar man did not bathe for 22 years, here's why he took the pledge
mictv telugu

వింత మనిషి.. 22 ఏళ్లుగా స్నానం లేదు, నో వాసన!

July 30, 2022

Bihar man did not bathe for 22 years, here's why he took the pledge

మామూలుగా ఒకటి, రెండు రోజులు స్నానం చేయకుండా ఉండటం పెద్ద విషయం కాదు. కానీ వారం పాటు స్నానం చేయకుండా ఎవరూ ఉండలేరు. మరీ మంచు కురిసే ప్రాంతాలైతే తప్ప మిగతా ఎక్కడైనా రోజుకో సారి లేదా రెండ్రోజులకు ఒక సారి స్నానం చేస్తుంటారు. కానీ బిహార్ కు చెందిన ఓ వ్యక్తి 10 రోజులు కాదు, 20 రోజులు కాదు ఏకంగా 20 ఏళ్లుగా స్నానం చేయడం లేదు. బిహార్ గోపాల్ గంజ్ జిల్లా, బైకుంఠపూర్ కు చెందిన ధరమ్ దేవ్ రామ్..2000 సంవత్సరం నుండి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. కారణమేంటో తెలుసా.. 22 ఏళ్ల క్రితం ధరమ్ దేవ్ కు 40 ఏళ్ల వయసు ఉండగా..మహిళలపై నేరాలు, భూ వివాదాలు, జంతు వధలు అరికట్టే వరకు స్నానం చేయనని శపధం చేశాడు. దాంతో పాటు భూతగాదాలు, హత్యలు ఆగిపోయేంత వరకు స్నానం చేయబోనని ప్రతిజ్ఞ చేశాడంట ధరమ్ దేవ్ రామ్.

అలా అప్పటినుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఆయన బంధువులు ఎవరు చనిపోయినా స్నానం మాత్రం చేయలేదు. అతని ప్రతిజ్ఞకు కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. ఆఖరికి 2003లో ధరమ్ దేవ్ భార్య మాయాదేవి చనిపోయినప్పుడు కూడా స్నానం చేయలేదు. అంతేకాదు ధరమ్ దేవ్ ఇద్దరు అబ్బాయిలు చనిపోయిన తర్వాత కూడా వారి శరీరాలపై చుక్క నీరు పోయలేదు..తను కూడా స్నానం చేయలేదు. అతని గురించి తెలిసిన ఆయన బంధువులు..స్థానికులు అతని సంకల్పాన్ని ప్రోత్సహిస్తారే తప్ప ఎప్పుడు ఒక్కమాటకూడా అనరు. ఆశ్చర్యకరంగా.. ధరమ్‌దేవ్‌కు ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదు. అంతేకాదు అతడి శరీరం నుంచి దుర్వాసన కూడా రాదు. అతడి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ప్రతిజ్ఞపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.