ఇతడు భగీరథుడికంటే గొప్పవాడు.. 20 ఏళ్లు తవ్వి..  - MicTv.in - Telugu News
mictv telugu

ఇతడు భగీరథుడికంటే గొప్పవాడు.. 20 ఏళ్లు తవ్వి.. 

September 16, 2020

Bihar Man digs 5-km canal over 20 years to bring water to his village

భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను దివి నుంచి భువి తెచ్చాడని చెప్పుకుంటాం. అతడు తన పూర్వీకులకు సద్గతి కోసం ఆ పనిచేశాడు. కానీ లౌంగీ బుయియా ఊరి ప్రజల కోసం భగీరథుడికంటే గొప్పపని చేశాడు. 20 ఏళ్లపాటు కాలువ తవ్వి ఊరికి గంగమ్మను పట్టుకొచ్చాడు. కొండను తవ్వి ఊరికి దారి వేసిన దశరథ్ మాంజీ రాష్ట్రం బిహార్‌ ఈ ఘనతకు కూడా వేదికైంది. 

గయ జిల్లా కొలితా గ్రామానికి చెందిన బుయియా ఒంటి చేత్తో 5 కిలోమీటర్ల  కాలువ తవ్వాడు. కేవలం పలుగు పారతోనే పని పూర్తి చేశాడు. గ్రామస్తుల పొంటపొలాలకు, పశువులకు నీటి సదుపాయం లేకపోవడం, కరువుతో స్థానికులు వలస వెళ్లడం చూసి అతడు బాధతో ఈ సాహసానికి పూనుకున్నాడు. ఊరికి దగ్గర్లోని చెరువు నుంచి కాలువ తవ్వడం తప్ప మరో మార్గం లేదని రంగంలోకి దిగాడు. ఎలాంటి చదువూ లేకపోయినా స్వయంగా ప్లాన్ గీసుకుని కాలువ తవ్వాడు. ప్రభుత్వాధికారులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. బుయియా చెమట చుక్కల గురించి ప్రపంచానికి తెలియడంతో చివరలో కొంత సాయం చేశారు.  కాలువకు అతని పేరే పెడతామంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు.