ఎవరైనా ఆకలేసి తింటే కాస్తో కూస్తో ఎక్కువగా తింటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఆస్తులు అమ్ముకునేలా తింటుడున్నాడు. ఏకంగా 10 మందికి సరిపోయే ఆహారం ఒక్కడే తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. దీంతో క్వారంటైన్ సిబ్బంది అతనికి వండి పెట్టలేం బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నారు. బిహార్‌లోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఇది వెలుగు చూసింది. ఈ వలస కార్మికుడి తిండి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
అనూప్ ఓజా(23) ఉపాధి కోసం రాజస్తాన్ వెళ్లాడు. లాక్‌డౌన్ విధించడంతో బక్సర్‌లోని మంజ్‌వారీ గ్రామానికి వచ్చాడు. నిబంధనల ప్రకారం అతన్ని 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. ఇదే వారు చేసిన తప్పైంది. అనూప్ ప్రతి రోజు తింటున్న తిండి చూసి ఇదేం తిండి అనుకుంటున్నారు. ఉదయాన్నే టిఫిన్‌లో 40 చపాతీలు, మధ్యాహ్నం 8-10 ప్లేట్ల ఆహారం తీసుకుంటున్నాడు. ప్రభుత్వం మాత్రం ప్రతి వ్యక్తికి నిర్ధిష్టమైన ఆహారం అందించాని సూచించింది. ఇతడి అసాధారణ ఆకలి చూసి నిర్వాహకులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి పరిశీలించగా నిజమేనని తేలింది. ఇక చేసేదేమి లేక ప్రతి రోజు అతనికి కావాల్సినంత ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ సంఘటన ఆనోటా ఈ నోట వైరల్ అయ్యింది. అంతా అతన్ని బకాసుడికి తమ్ముడిలా పోల్చుతున్నారు.