మరక మంచిదే, కరోనా మంచిదే.. పోయిన డబ్బు సేఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

మరక మంచిదే, కరోనా మంచిదే.. పోయిన డబ్బు సేఫ్

May 6, 2020

Bihar man gets his lost money corona times 

మరక మంచిదే అని ఓ డిజర్జెంట్ సబ్బు వాణిజ్య ప్రకటన అంటుంది. కరోనా కూడా మంచిదే సుమా అంటున్నాడు ఓ డ్రైవర్. కరోనా రాకముందు  రోడ్డుపై నోటు కాదు కదా చిల్లర కనిపించినా తీసుకునే జనం ఇప్పుడు 500 నోట్లు కనిపించినా, హబ్బే.. మేం రోడ్డుపై పడిపోయిన పరాయిసొమ్ము తీసుకోమబ్బా అని పోజులు కొడుతున్నారు. వాటికి కరోనా వైరస్ ఉంటుందని తీసుకోవడం లేదన్నమాట. అలాంటి భయం వల్ల పోగొట్టుకున్న డబ్బులు సేఫ్ గా యజమానికి చేరిన సంఘటన బిహార్‌లోని సహర్ష జిల్లాలో జరిగింది. 

గజేంద్ర షా అనే ఆటోడ్రైవర్ సరుకులు కొనుక్కోడానికి రూ. 25 వేలు జేబులో వేసుకుని మార్కెట్ వెళ్లాడు. జేబు బరువు బాగా తగ్గడంతో దారిలో ఓసారి తడుముకుని చూశాడు. గుండె గతుక్కుమంది. రూ. 20,500 పోయాయి. పొగాకు తీసేటప్పుడు పడిపోయి ఉంటాయని భావించి ఖర్మ అని నెత్తుకొట్టుకుని ఇంటికెళ్లాడు. తర్వాత సోషల్ మీడియా బాగా చూసే ఇరుగుపొరుగు వారి ద్వారా శుభవార్త తెలిసింది. దారిలో ఎవరో డబ్బు పారేసుకున్నారని, ఉడా కిషన్ గంజ్ పోలీసుల వద్ద వారు చెప్పారు. నేరుగా ఠాణకు వెళ్లి ఆధారాలు చెప్పి డబ్బు తీసుకున్నాడు. కరోనాను వ్యాపించడానికి ఎవరో డబ్బు పారేసినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, అదే గజేంద్ర డబ్బును కాపాడిందని పోలీసులు చెప్పారు.