bihar man in Drunken Mood dies after snake bites
mictv telugu

పామును ముద్దుపెట్టుకుని పరలోకానికి.. వీడియో

March 6, 2023

bihar man in Drunken Mood dies after snake bites

పిచ్చి, వెర్రి, మత్తు.. ఇలాంటి కారణాలు ఏవైనా.. తింగరి చేష్టలతో పోగొట్టుకున్న ప్రాణం మాత్రం తిరిగిరాదు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా.. ఆ వార్తలు చూసి కూడా జనాల్లో ఎలాంటి మార్పు రాలేదు సరికదా.. ఇంకాస్త మితిమీరిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాములకు ముద్దులు పెట్టడం, కోతులతో సెల్ఫీ దిగడం వంటి పనులు చేసి ఉసురు కోల్పోయారు. తాజాగా బిహార్‌లోని నవాదా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా మందుకొట్టి ఓ యువకుడు నాగు పామును ముద్దాడాడు. దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేసాడు. దీంతో ఆ పాము కాటు వేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. గోవింద్‌పుర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

నారాయణ్ పూర్ గ్రామానికి చెందిన దిలీప్ యాదవ్ అనే వ్యక్తి ఫుల్గా మద్యం తాగి.. పామును ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆ సర్పాన్ని మెడలో వేసుకున్నాడు. అక్కడే ఉన్న ఓ ఆలయం ముందు శిరస్సు వంచి దండాలు పెట్టాడు. తనను క్షమించమని దేవుడిని కోరాడు. ఆ తర్వాత మెడలో పాముతో కాసేపు చిందులేశాడు. అయితే, ఈ తాగుబోతు వేషాలు చూసి అక్కడ గుమిగూడిన జనం.. పామును వదిపెట్టాలని కోరారు. కానీ దిలీప్ అవేమీ పట్టించుకోలేదు. కాసేపటికి తర్వాత వదిలిపెట్టాడు. కానీ అప్పటికే ఆ పాము కాటువేయడం వల్ల కిందపడిపోయాడు. దీంతో అతడిని వెంటనే గోవింద్‌పుర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దిలీప్ యాదవ్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దిలీప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.