కారునే హెలికాప్టర్‌గా మార్చేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కారునే హెలికాప్టర్‌గా మార్చేశాడు..

August 11, 2019

కారులో వెళితే మజా ఏం ఉంటుంది. దాన్నే హెలికాప్టర్‌గా మార్చేసి అందులో తిరిగితే ఆ కిక్కే వేరు అనుకున్నాడు ఓ యువకుడు. వెంటనే అతడు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ‘టాటా నానో కారు’ను హెలికాప్టర్‌గా మార్చాడు బిహార్‌కు చెందిన మితిలేశ్ ప్రసాద్ అనే యువకుడు.దానితో రోడ్డుపై దూసుకెళ్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఛప్రా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మితిలేశ్ ప్రసాద్‌కు హెలికాప్టర్ తయారు చేయాలనే కోరి ఉండేది. దాన్ని తీర్చుకునేందుకు కావాల్సిన సామాను కొనడానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోలేదు. దీంతో సరికొత్త ఆలోచన చేశాడు. ఓ టాటా నానో కారు కొని దానికి హెలికాప్టర్‌కు ఉన్నట్టుగా పైన రెక్కలు, వెనక భాగాన తోక, మధ్యలో ఓ చక్రాన్ని అమర్చాడు. అచ్చం హెలికాప్టర్‌ను పోలీ ఉన్నట్టుగా తయారు చేశాడు.

ఇలా చేయడానికి అతడికి రూ. 7 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఆ కారులో రోడ్డుపై ప్రయాణిస్తుంటే అచ్చం హెలికాప్టరే రోడ్డుపై పరిగెడుతోందని అన్నట్టుగా కనిపిస్తోంది. ఇలా తాను చేయడం ఎంతో మంచి అనుభూతిని ఇస్తుందని చెబుతున్నాడు మితిలేశ్. అతడి తెలివికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.