వరంగల్ మిస్టరీ.. 11వ మర్డర్ కూడానా.? - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ మిస్టరీ.. 11వ మర్డర్ కూడానా.?

May 28, 2020

Bihar Migrants in Warangal Well

వరంగల్‌‌లో సంచలనం సృష్టించిన వలస కూలీల మర్డర్ మిస్టరీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక హత్యను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా 9 మందిని సంజయ్ అనే ఒకే ఒక్క వ్యక్తి హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. కానీ తాజాగా మరో మర్డర్ కూడా అతడు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నట్టగా తెలుస్తోంది.  రఫికా భర్త ఆచూకీ లేకపోవడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంజయ్ నేర చరిత్రపై కూడా ఆరా తీస్తున్నారు. 

బిహార్‌కు చెందిన రఫీకాతో ఢిల్లీలో ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తుండగా సంజయ్‌కి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాహేతర సంబందానికి దారి తీసింది.  కొన్ని రోజులకు రఫికా భర్త  కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పిల్లలతో వరంగల్ వచ్చి స్థిరపడ్డారు. నాలుగేళ్ల క్రితం నుంచి అతడు కనిపించకపోవడంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. అతని వివరాలు తెలిస్తే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతడి నుంచి పూర్తి సమాచారం రాబట్టే పనిలో పడ్డారు. మరోవైపు మొత్తం కుటుంబం హత్యకు గురికావడంతో రఫికా ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు.