కరోనాతో మంత్రి మృతి.. ఎన్నికల వేళ టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో మంత్రి మృతి.. ఎన్నికల వేళ టెన్షన్

October 16, 2020

nngn

దేశంలో కరోనా కాటుకు అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు బలి అవుతూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేకుండా పోతోంది. తాజాగా బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా కారణంగా పంచాయతీ రాజ్ మంత్రి జేడీయూ కీలక నేత కపిల్ డియో కామత్ కన్నుమూశారు. పట్నాలోని ఎయిమ్స్‌లో కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. 

ఆయన మరణంపై సీఎం నితీశ్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ కీలక నేత చనిపోవడం సంచలనంగా మారింది. ఇటీవలే ఈ రాష్ట్ర మంత్రి వినోద్ సింగ్ కూడా కన్నుమూశారు. వరుసగా జరుగుతున్న మరణాలు స్థానికల్లో మరింత వైరస్ పట్ల మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.