‘నీ అయ్య.. ’.. వలస కూలీపై ఎమ్మెల్యే తిట్లదండకం.. - MicTv.in - Telugu News
mictv telugu

‘నీ అయ్య.. ’.. వలస కూలీపై ఎమ్మెల్యే తిట్లదండకం..

May 25, 2020

Bihar

దేశంలో ఏ రోడ్డు చూసినా వలస కూలీల చెమట, రక్తమే.  ఏ షెల్టర్ హోంలో చూసినా వాళ్ల కన్నీళ్లే. ఎండలో ప్రాణాకలు తెగించి నడుస్తున్న కార్మికులను కొందరు ఆదుకుంటూ ఉంటే ఓ ఎమ్మెల్యే మాత్రం దారుణంగా తిట్టాడు. ‘నీ యబ్బ, నీ బాబు.. ’ అని రాక్షసుడిలా విరుచుకుపడ్డాడు. బిహార్‌లోని షేక్ పురా జిల్లా చాందీ గ్రామంలోని క్వారంటైన్ సెంటర్లో ఈ దుర్మార్గం జరిగింది. 

జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోని ఇటీవల అక్కడికి వెళ్లారు. కూలీలు ఆయనతో గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని, లాక్ డౌన్ వల్ల పనిలేక అష్టకష్టాలు పడుతున్నామని క్వారంటైన్ లోని వాపోయారు. నితీశ్ ప్రభుత్వంగానీ, మోదీ ప్రభుత్వంగానీ తమను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంల తమకు ఉపాధిలేక పరాయి రాష్ట్రాలకు వెళ్లి నానా బాధలూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సోనికి ఎక్కడో కాలిపోయింది. ‘ఎందుకు సాయం చెయ్యాలి? ఉద్యోగం ఇప్పించు అని నీ అయ్యను అడగావా? నీ అయ్య నీకు పని చూపాడా? మేం ఎదుకు సాయం చెయ్యాలి?’ అని బూతులకు లంకించుకున్నాడు. దీంతో కూలిజనం నివ్వెరపోయారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే బూతులకు దిగడం వీడియోలో రికార్డయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజనం డిమాండ్ చేస్తోంది.