Bihar: Parents in Samastipur beg for money after hospital employee demands Rs 50,000 to release son's body
mictv telugu

మృతదేహం అప్పగించేందుకు లంచం డిమాండ్.. తల్లిదండ్రుల భిక్షాటన

June 9, 2022

Bihar: Parents in Samastipur beg for money after hospital employee demands Rs 50,000 to release son's body

ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు రూ.50 వేలు డిమాండ్ చేసింది ఆసుపత్రి సిబ్బంది. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన బాధితులు.. మృతదేహం కోసం భిక్షాటన చేయడం ప్రారంభించారు. బీహార్‌లోని ముశ్రీఘ‌ర్హార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 6న ఓ మాన‌సిక విక‌లాంగుడు అదృశ్య‌మ‌య్యాడు. స్థానికంగానే ఆ బాలుడు చ‌నిపోయి ఉండ‌టాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. 7వ తేదీన పోలీసులు బాలుడి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స‌మ‌స్తిపూర్ స‌దార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

కుమారుడి మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయడం వల్ల.. సొమ్ము కోసం ఆ తల్లిదండ్రులు ఊరంతా తిరుగుతూ భిక్షమెత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది . దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు… గత కొన్ని రోజులుగా వారికి జీతాలు లేకపోవడంతో ఇలా రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ వినయ్‌ కుమార్‌ రాయ్‌ తెలిపారు.