కూతురి కాలుతో పోలీస్ స్టేషన్‌కు తండ్రి.. ఎంత బాధపడ్డాడో.. - MicTv.in - Telugu News
mictv telugu

కూతురి కాలుతో పోలీస్ స్టేషన్‌కు తండ్రి.. ఎంత బాధపడ్డాడో..

June 10, 2022

వరకట్న దాహానికి ఓ వివాహిత బలైపోయింది. తాము అడిగిన కట్నం ఇవ్వలేదనే కోపంతో మహిళను భర్త,అత్తమమాలు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ అమానుష సంఘటన బీహార్ రాష్ట్రంలోని భోజ్పుర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గతేడాది మే నెలలో భోజ్పుర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరౌలీ గ్రామానికి చెందిన శత్రుఘ్న బింద్తో.. బభన్గామా గ్రామానికి చెందిన మమతా దేవికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మమతా దేవి తల్లిదండ్రులు…అల్లుడికి కట్నం ఇచ్చారు.

కొద్ది రోజుల తర్వాత వ్యాపారం చేసేందుకు రూ.2 లక్షలు తేవాలని అత్తింటివారు వేధించటం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఇటీవలే తల్లిదండ్రులకు తెలియజేసింది బాధితురాలు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల వారి డిమాండ్ను తీర్చలేకపోయారు. తాము అడిగిన డబ్బులు పుట్టింటి నుంచి తీసుకురాలేదన్న కోపంతో మమతా దేవిని భర్త, అత్తమామలు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేసేందుకు గుట్టుగా పూడ్చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఓ కారును అద్దెకు తీసుకుని సరిపుర్ విశ్వన్ పుర్ గ్రామం సమీపంలో నది ఒడ్డున పూడ్చేశారు. ఆ తర్వాత కారును పంపించేశారు. ఆ తర్వాత పోలీసులు పసిగడతారేమోనన్న భయంతో మృతదేహాన్ని బయటకు తీసి కాల్చేశారు.
కారు డ్రైవర్ను అనుమానస్పద రీతిలో గుర్తించిన కొందరు గ్రామస్థులు పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటడింది. వెంటనే వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముఫాసిల్ పోలీసులతో కలిసి వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే.. 90 శాతం మేర మృతదేహం కాలిపోయింది. కేవలం ఎడమ కాలు మాత్రమే మిగిలింది. దాని ద్వారానే బాధితురాలిని గుర్తించారు. మిగిలిన కాలును బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పాడు.
బాధితురాలి కాలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డీఎన్ఏ, ఫొరెన్సిక్ పరీక్షల కోసం బిహార్ రాజధాని పట్నాకు పంపించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.