బయటికొస్తే సత్కారమే.. వెటకారం కాదు, నిజం.. - MicTv.in - Telugu News
mictv telugu

బయటికొస్తే సత్కారమే.. వెటకారం కాదు, నిజం..

April 4, 2020

Bihar patna police facilitates lockdown violators with garland 

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు ఏ  పనీపాటా లేకున్నా ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. కేసులు, జరిమానాలను లెక్కచేయకుండా తిరుగుతున్నారు. దీంతో కొన్ని చోట్ల పోలీసులు సృజనాత్మకను రంగరించి శిక్షలు వేస్తున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో పోలీసులు ఉల్లంఘనులకు హారతి పట్టి గౌరవించడం తెలిసిందే. 

తాజాగా బిహార్ రాజధాని పట్నాలో పోలీసులు మరో అడుగు ముందుకేసి.. తిరుగుబోతులకు పూలదండలు వేసి సత్కరిస్తున్నారు. ‘వారెవ్వా.. మీరు చాలా గొప్ప చేస్తున్నారు. మిమ్మల్ని గౌరవించడం మా బాధ్యత. ఏదీ, ఒకసారి నవ్వుతూ పోజు ఇవ్విండి.. ఫోటోలు తీసుకుంటాం.. ’ అని పోలీసులు అంటుంటే ఉల్లంఘనులు సిగ్గుతో చితికిపోతున్నారు. బిహార్‌లో ఇప్పటివరకు 31 కరోనా కేసులు నమోదయ్యాయి.