Bihar Police arrested two terrorists
mictv telugu

మోదీ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన బీహార్ పోలీసులు

July 14, 2022

ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన ఇద్దరు ఉగ్రవాదులను బీహార్ పోలీసులు పట్టుకున్నారు. అంతేకాక, ప్రధాని మోదీ వారి రెండో లక్ష్యమని మొదటి లక్ష్యం భారత్‌ను 2047 నాటికి ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్నదని పోలీసులు గుర్తించారు. జులై 12న మోదీ పర్యటన సందర్భంగా చంపాలని ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..‘పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆ సమాచారాన్ని ఎన్ఐఏకు, బీహార్ పోలీసులకు చేరవేసింది. దీని ఆధారంగా వలపన్ని ఆస్థార్ పర్వేజ్, జలాలుద్దీన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. వారున్న ప్రాంతం నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. అలాగే దేశవ్యాప్తంగా చాలా మంది యువత ఇక్కడికి వచ్చి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్టు గుర్తించామ’ని తెలిపారు.