ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసేందుకు ఎక్కడా ప్లేస్ లేనట్టు ఏటీఎంను ఎంచుకుంది. అది పని చేయడం లేదని తెలుసుకొని ప్రియుడు ప్రియురాలిని తీసుకొని అందులో ఎంజాయ్ చేయాలని భావించాడు. కానీ మూడో కన్ను తమను చూస్తుందన్న సంగతి మర్చిపోయి అందులోనే శృంగారం మొదలెట్టేశారు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి పరువు పోగొట్టుకున్నారు. బీహార్ లో వెలుగు చూసిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాట్నాలోని కంకర్ బాగ్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం ఉంది. గత కొన్ని రోజులుగా పని చేయకపోవడంతో మనుషులు ఆవైపు వెళ్లడం మానేశారు.
దీన్ని గమనించిన ప్రియుడు తన ప్రియురాలితో ఏకాంతంగా గడపడానికి అదే తగిన ప్రదేశం అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన ప్రేయసిని తీసుకొని ఖాళీగా ఉన్న ఏటీఎంలోకి దూరాడు. అక్కడే కార్యాన్ని కానిస్తుండగా, సీసీ కెమెరాలు ఉన్న సంగతిని మర్చిపోయి పూర్తిగా రొమాన్స్ లో మునిగిపోయారు. ఈ జంట రాసలీలతో కెమెరా డిపార్ట్ మెంట్ లోని అధికారులకు ఫ్రీ షో ఇచ్చి పడేశారు. వారి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లి జంటను అరెస్ట్ చేశారు. విచారణలో వారిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ అని తేలింది. దాంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కామానికి సిగ్గూ బిడియం ఉండదని, చివరికి ఏటీఎంని కూడా వదలరా, ఓయో రూములు ఉన్నాయి కదా బ్రదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.