వావ్.. పోలీస్ క్యాండీక్రష్..! - MicTv.in - Telugu News
mictv telugu

వావ్.. పోలీస్ క్యాండీక్రష్..!

June 29, 2017

కళ్ల ముందే సీఎం..పోలీస్ బాస్ ఉన్నారు. హాట్ హాట్ గా స్పీచ్ లు ఇస్తున్నారు. అయినా వారి మాటలు పోలీసులకు వినిపించలేదు. మరో లోకంలోకి వెళ్లిపోయారు. ఎంతగా అంటే ముందున్నది సీఎం , డీజేపీ అని మరిచి పోయే లెవల్లో…ఇంతకీ పోలీసులు ఏం చేశారనే కదా డౌట్ …

బీహార్ రాష్ట్ర పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నియంత్రణపై పాట్నాలో ఓ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో పాటు డీజీపీ, ఇతర పోలీసుల ఉన్నతాధికారులు వచ్చారు. ప్రారంభమయిన కొద్దిసేపటికే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ స్మార్ట్ ఫోన్లు ఓపెన్ చేశారు.

సీఎం ఎదుటే కొందరు ఫోన్‌లో క్యాండీక్రష్ గేమ్స్ ఆడారు. మరికొందరు నెట్ బ్రౌజింగ్ చేశారు. ఆ సమయంలో వీడియో తీస్తున్నా వాళ్లు పట్టించుకోలేదు. ఈ ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఫోటోల్లో ఉన్న పోలీసుల పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.