bihar poorest mla ram vruksh sada get emotional
mictv telugu

ఈ ఎమ్మెల్యే ఆస్తులు ఎంతో తెలిస్తే అయ్యో అంటారు..

November 8, 2022

అతను ఓ నిరుపేద ఎమ్మెల్యే..అతని స్థిరాస్తులు రూ.75 వేలు..అతని వద్ద ఉన్న నగదు రూ.25 వేలు మాత్రమే. నమ్మశక్యంగా లేని ఈ విషయం అక్షర సత్యం. బీహార్లోని ఆర్జేడీ ఎమ్మెల్యే ‘రామ్ వృక్ష్ సదా’ నేటి రాజకీయనాయకులకు పూర్తిగా వ్యతిరేకం. బీహార్‌లోని ఎమ్మెల్యేలలో నిరుపేద ఎమ్మెల్యే ఈయనే. ఇప్పటివరకు ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన నివాసంలో ఆయన నివసించేవారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చే అధికార నివాసం యొక్క తాళాలను అందుకోని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘రామ్ వృక్ష్ సదా’ ఖగరియా జిల్లాలోని అలౌలీ నియోజకవర్గం నుంచి సదా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జిల్లాలోని రౌన్ అనే గ్రామంలో రెండు బెడ్రూంల ఇంట్లో సదా కుటుంబం ఉంటోంది. ఈ ఇంటిని కూడా 2004లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద నిర్మించుకున్నట్లు సదా చెప్పారు. ఇందులో ఐదుగురు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉంటున్నట్లు వివరించారు.

అయితే, ప్రజాప్రతినిధుల కోసం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇళ్లు కేటాయించింది. పాట్నాలో మూడు అంతస్తులతో నిర్మించిన ఈ భవనాలు పొందిన వాళ్లలో సదా కూడా ఉన్నారు. ఈ ఇంటికి సంబంధించిన తాళాలను సదా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సదా భావోద్వేగానికి గురయ్యారు. ఏదైనా విలువైనది దొరికినప్పుడే పేదవాడికి నిజమైన దీపావళి అని సదా వ్యాఖ్యానించారు. ఇప్పుడు తనకూ అలాగే ఉందని చెప్పారు