పాఠాలు చెప్పలేదని జీతం డబ్బులు రూ. 24 లక్షలు ఇచ్చేసిన ప్రొఫెసర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాఠాలు చెప్పలేదని జీతం డబ్బులు రూ. 24 లక్షలు ఇచ్చేసిన ప్రొఫెసర్

July 7, 2022

కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు దేశ వ్యాప్తంగా మూతపడ్డాయి. ఆ సమయంలో విద్యార్ధులకు పాఠాలు చెప్పలేదని, తనకు వచ్చిన జీతం డబ్బులను వెనక్కి తిరిగిచ్చేశాడు ఓ ప్రొఫెసర్. ఆసక్తికరంగా ఉన్న ఈ సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. వివరాల్లోకెళితే.. ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లలన్ కుమార్ అనే వ్యక్తి 2019 సెప్టెంబరులో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తర్వాత కొద్ది నెలలకే కరోనా లాక్‌డౌన్ రావడంతో కాలేజీ మూతపడింది. ఆన్‌లైన్ క్లాసులు జరిగినా అందుకు విద్యార్ధులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పనిచేయకుండా జీతం తీసుకోవడం తప్పని భావించిన లలన్ కుమార్ తనకు వచ్చిన 33 నెలల జీతం మొత్తం రూ. 24 లక్షలకు తిరిగిచ్చేశాడు. ఆ మొత్తం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు చెక్కు రూపంలో మంగళవారం ఇచ్చేశారు.