ప్రేయసిని కలవడానికి ఎలక్ట్రీషియన్ వింత పని.. గ్రామస్థుల షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేయసిని కలవడానికి ఎలక్ట్రీషియన్ వింత పని.. గ్రామస్థుల షాక్

May 11, 2022

ప్రేమించిన యువతిని కలుసుకోవడానికి ఓ ఎలక్ట్రీషియన్ చేసిన పనికి ఆ గ్రామస్తులు విస్తుపోయారు. అనంతరం ప్రేమ జంటను కలిపి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పూర్నియా జిల్లాలోని గణేష్ పూర్ గ్రామంలో రోజూ సాయంత్రం రెండు మూడు గంటల పాలు కరెంటు పోతుండేది. కొన్ని రోజులు చూసిన గ్రామస్తులు, అదే సమయంలో పక్క ఊర్లలో కరెంటు ఉండడాన్ని గమనించారు. కేవలం తమ ఊరిలోనే నిర్దిష్ట సమయంలో కరెంటు ఎందుకు పోతోందో తెలసుకుందామని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రీషియన్ మీద నిఘా వేశారు. అతనికి తెలియకుండా వెంబడించి అసలు విషయం కనుక్కున్నారు. ఆ ఎలక్ట్రీషియన్ తన ప్రేయసిని కలవడానికి రోజూ ఆ సమయంలో కరెంటు తీస్తున్నాడని, పగలు కలవడం కుదరక, సాయంత్రం చీకటి పడే సమయానికి కరెంటు తీసి ఆమెను కలుస్తున్నాడని గ్రహించారు. దీంతో ఓ రోజు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రేమజంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్ని రోజులుగా ఇబ్బంది కరెంటు విషయంలో ఇబ్బంది పెట్టాడనే కోపంతో గ్రామస్తులు మొదట ఎలక్ట్రీషియన్‌ను కొట్టారు. శిక్షగా వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత ఇరువురి ఇష్టంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ ప్రేమజంటకు పెళ్లి చేశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా, ఎలాంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు.