సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న మరో రాష్ట్రం - MicTv.in - Telugu News
mictv telugu

సంపూర్ణ లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న మరో రాష్ట్రం

July 14, 2020

n vgnb

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున ఇరవై వేల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు, పూణే నగరాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా శని, ఆది వారాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని చూస్తోంది. తాజాగా బీహార్ రాష్ట్రం కూడా మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది. ఈమేరకు బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచిస్తున్నదని బీహార్ ప్రధాన కార్యదర్శి దీపక్ ‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,421కు పెరిగింది.