బీహార్ టాపర్లు వట్టి మోసగాళ్లు... - MicTv.in - Telugu News
mictv telugu

బీహార్ టాపర్లు వట్టి మోసగాళ్లు…

June 5, 2017

త‌న‌కు 24 ఏళ్లే ఉన్నాయ‌ని చెప్పి, 12 వ క్లాస్ హ్యుమానిటీస్ స‌బ్జెక్ట్ లో బీహార్ టాప‌ర్ గా నిలిచిన గణేశ్ కుమార్ బండారం బ‌య‌ట‌ప‌డింది. మోసం చేసి ప‌రీక్ష రాసి టాప్ ర్యాంకు సాధించాడు. అస‌లు గ‌ణేశ్ కుమార్ వ‌య‌సు 42 ఏళ్లు. పెళ్లి అయి .ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. గతేడాది కూడా టాప‌ర్ గా నిలిచి టీవీ ఇంట‌ర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన రుబీ రాయ్ కోవ‌లోకే ఇతను వచ్చాడు. బీహార్ టాప‌ర్ గా గణేశ్ నిల‌వ‌డంతో ఆయ‌న‌ను ఇంటర్వ్యూ చేయ‌డానికి టీవీ ఛాన‌ల్స్ ఆయ‌న‌ను సంప్ర‌దించాయి. సంగీతం గురించి మీడియా ప్ర‌తినిధులు వేసిన చిన్న చిన్న ప్ర‌శ్న‌ల‌కు కూడా గ‌ణేశ్ స‌మాధానాలు చెప్ప‌లేక‌పోవ‌డంతో అస‌లు బండారం బ‌య‌ట‌పడింది. వెంట‌నే విష‌యం తెలుసుకున్న బీహార్ స్కూల్ ఎగ్జామినేష‌న్ బోర్డ్ సిబ్బంది పోలీసులుకు ఫిర్యాదు చేయ‌డంతో జైల్లో పెట్టారు.