పశువుల డాక్టర్ కిడ్నాప్.. బలవంతంగా పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

పశువుల డాక్టర్ కిడ్నాప్.. బలవంతంగా పెళ్లి..

June 15, 2022

వెటర్నరీ డాక్టర్‌ను కిడ్నాప్ చేసి ఓ మహిళతో బలవంతంగా వివాహం జరిపించారు. బిహార్ బెగూసరాయ్ జిల్లాలోని పిధౌలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పశువులకు జబ్బు చేసిందని చెప్పి డాక్టర్ సత్యం కుమార్‌కు.. హసన్‌పూర్‌కు చెందిన విజయ్ సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. చికిత్స కోసం హసన్‌పూర్‌కు వెళ్లిన.. సత్యంను విజయ్ కిడ్నాప్ చేసి, ఓ మహిళతో వివాహం జరిపించాడు. ఆ తర్వాత సత్యం జాడ దొరకలేదు. బాధితుడి తండ్రి సుబోధ్ కుమార్ ఝా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు దీనికి సంబంధించిన నిందితుల కోసం తనిఖీలు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెళ్లి దుస్తుల్లో ఉన్న సత్యం.. ఓ మహిళ చెయ్యిలో చెయ్యి వేసి వేద మంత్రాల మధ్య వివాహం చేసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆమెను ఇష్టపడి చేసుకున్నాడా..? లేదంటే బలవంతంగా పెళ్లి జరిపించారా అనేది తెలియాల్సి ఉంది.