ఎహె నువ్వు పూల్ కాదు...భలే చాలూ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎహె నువ్వు పూల్ కాదు…భలే చాలూ..

June 29, 2017

లాలూ, నితీష్ లు బీహార్ లో పవర్ ఫుల్ ఫ్రెండ్స్. సర్కార్ సంసారం చక్కగా సాగిపోతోంది. ఒకరు అంటే ఒకరికి గౌరవం. ఇలా సాగుతోన్న అధికార సంసారంలో కాబోయే ప్రథమ పౌరుడు పుల్ల పెట్టారు. అంతే పవర్ ఫ్రెండ్స్ విడిపోతున్నట్టు వార్తలొచ్చాయి. ఇది నిజమేనా..? లాలూ కూర్చున్న కొమ్మనే నరక్కుంటారా..?

దేశం నజర్ కొద్దిరోజులుగా బీహార్ పాలిటిక్స్ పై ఉంది. సీఎం నితీశ్‌కుమార్‌ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కే మద్దతు ప్రకటించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతిస్తున్నారు. సో నితీశ్‌ తీసుకున్న నిర్ణయంతో మహా కూటమి కష్టాల్లో పడిందని వూహాగానాలు వస్తున్నాయి. నితీశ్‌ మంత్రివర్గంలో ఉన్న లాలూ తనయులు తేజస్వీ, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లు ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా నితీశ్‌, లాలూ మధ్య విభేదాలకు కారణమట. ఇప్పుడు నితీశ్‌ కేంద్రానికి మద్దతివ్వడంతో లాలూ కూటమి నుంచి తప్పుకొంటారని వినిపిస్తోంది.

ఈ రూమర్స్ పై లాలూ సీరియస్ గా రియాక్టయ్యారు. నేనేమైనా ఫూల్‌నా? కాళిదాసులా కన్పిస్తున్నానా? అంటూ ఫైర్ అయ్యారు. మహాకవిగా మారకముందు కాళిదాసు తాను కూర్చున్న కొమ్మను తానే నరకొన్నారు. దీన్ని ప్రస్తావిస్తూ.. నితీశ్‌తో తెగదెంపులు చేసుకుని బిహార్‌ ప్రభుత్వాన్ని పడగొడితే తన లక్ష్యాలను తనే పడగొట్టినట్లవుతుందన్నారు లాలూ.

భలే వాడివి లాలూ… పుకార్లు వస్తే నువ్వు విడిపోతావెంటీ. ఎంతైనా సుపుత్రులు తమరి బాటలో నడుస్తున్నారు. ఇది ఇలాగే సాగాలంటే నితీష్ నిప్పులా చిటపటలాడినా సర్దుకుపోవాల్సిందే. అందుకే లాలూ నువ్వు పూల్ వి కాదు చాలూవు…అప్పట్లో తండ్రి పశువులు గడ్డి తింటే..ఇప్పుడు కొడుకులు ఏం తింటారో చూడాలి.