నలభై ఏండ్ల రాజకీయ జీవితం అతనిది..! అంతా క్లీన్ చీట్..! - MicTv.in - Telugu News
mictv telugu

నలభై ఏండ్ల రాజకీయ జీవితం అతనిది..! అంతా క్లీన్ చీట్..!

July 26, 2017

నితీష్ కుమార్ భారత రాజకీయాల్లో ఆయన కంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి,బీహార్ ప్రజల నాడిని  పట్టుకొని విజయవంతంగా.. అక్కడి రాజకీయాల్లో రాణించిన వ్యక్తి. బీహార్ తో పాటు,జాతీయ రాజకీయాల్లోను చక్రం తిప్పిన ధీశాళి నితిష్ కుమార్.1951 మార్చ్ ఒకటిన బీహార్ లోని భక్తియార్ పూర్ లో జన్మించారు,ఎన్ ఐటి పాట్నా నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు,బీహార్ రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా పేరు సంపాదించిన నితీష్..సోషలిస్ట్ రాజకీయాలతో ముందుకు సాగారు. జయప్రకాష్ నారాయణ్,రామ్ మనోహర్ లోహియా,ఎస్ ఎన్ సింహా,కర్పురీ థాకూర్,వి పి సింగ్  అడుగుజాడల్లో నడిచాడు.అవినీతికి వ్యతిరేకంగా 1974 నుంచి 1977 వరకు జరిగిన జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో పాఠాలు నేర్చుకున్నాడు.

1985 లో స్వతంత్ర అభ్యర్ధిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.ఆ తర్వాత జనతా దళ్ లో చేరి 1989 లో తొమ్మిదవ లోక్ సభలో ఎం.పి గా అడుగుపెట్టారు.అదే సంవత్సరం విపి సింగ్ ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిగా పని చేసారు.1991 ఎన్నికల్లో తిరిగి లోక్ సభకు ఎన్నికైన నితీష్..అపోజిషన్ పార్టీ డిప్యూటీ లీడర్ గా జనతా దళ్ నుంచి వ్యవహరించారు.ఇలా ఆయన ప్రస్థానాన్ని  కొనసాగిస్తూ 3 సార్లు బీహార్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.2010లో 7 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా నితీష్ కొనసాగారు,తర్వాత రబీదేవిని ముఖ్యమంత్రి పదవి వరించింది,మళ్లీ 2005లో ఒకసారి.. 2015 లో మరోసారి నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు.2015 బీహార్ లో మహా కూటమి ఏర్పాటులో,లాలూతో జత కట్టడంలో నితీష్  చొరవనే ప్రధాన కారణమనేది చెప్పుకోదగ్గ విషయం. ఏది ఏమైనప్పటికి నితీష్ రాజీనామా ..రాజకీయ పరిశీలకులకు కొత్త పాఠాలు నేర్పిస్తుంది.