భారత క్రికెటర్ ప్రపంచ రికార్డ్.. తొలి రంజీలోనే 340 పరుగులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత క్రికెటర్ ప్రపంచ రికార్డ్.. తొలి రంజీలోనే 340 పరుగులు

February 19, 2022

01

ఒక మ్యాచ్‌లో సెంచరీ కొడితే గొప్ప. రెండు సెంచరీలు చేస్తే కే. మూడు సెంచరీలు చేస్తే కేకకే కేక. మూడు సెంచరీలకుపైగా చేస్తే? పొగడటానికి మాటలు చాలవు. బిహార్ కుర్ర క్రికెటర్ సకిబిల్ గనీ ఈ అద్భుతం సాధించాడు. రంజీల్లో శుక్రవారం సకిబుల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. మిజోరంతో శుక్రవారం జరిగిన రెండో రోజు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ దీనికి వేదికైంది. 22 ఏళ్ల సకిబుల్ గని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అజయ్ రాజ్‌కుమార్ రొథెరా పేరిట ఉండేది. 2018లో 267 పరుగులతో అజయ్ రొథెరా నాటౌట్‌గా నిలిచాడు.
మోతిహరి జిల్లాకు చెందిన సకిబుల్ 56 ఫోర్లు కొట్టాడు. మరో ఆటగాడు బాబుల్‌తో కలిసి నాలుగో వికెట్ వద్ద 538 పరుగుల భాగస్వామ్యం చేశారు.