బిత్తిరి సత్తిపై దాడి చేసింది ఇతడే.. - MicTv.in - Telugu News
mictv telugu

బిత్తిరి సత్తిపై దాడి చేసింది ఇతడే..

November 27, 2017

తీన్మార్ బిత్తిరి సత్తిపై దాడి చేసింది ఎవరో తెలిసింది. అతణ్ని సికింద్రాబాద్ కు చెందిన మణికంఠగా గుర్తించారు. సత్తి తెలంగాణ భాషను అవమానించినందుకే దాడి చేశాననని అతడు అన్నాడు. మణికంఠ ఏం చెప్పాడో అతని మాటల్లోనే…

‘‘తెలంగాణని ,దేశాన్ని ఎక్కో ప్రేమించెటోడు v6 ఛానెల్ వెట్టి చూస్తే అర్థమైతది..మన భాషను ఎంతగ అవమానిస్తున్నరనేది. పక్కనుండి ఎవలన్న పిచ్చోడని తిట్టుకుంట వోతే మనకు మండుతదా లేదా? తెలంగాణను కించపరిస్తూ, ఎక్కిరిస్తూ, అబద్దాలు చెబుతుంటే నాకు గుడ మండింది. వాన్కి నేనేంటో చూపించాలని అనుకున్న చూపించిన.

పొద్దుగల లేశి బుక్కులు సద్వుతా, నాపేరు మణికంట, మాది సికింద్రబాద్ నా వయసు 26 నేను రైటర్, డైరెక్టర్ అయిదామనుకుంటున్న మాస్ కమ్యూనికేషన్ చేశ్న .  అబద్దాలు జెప్పుకుంట , తెలంగాణ భాషను ఎక్కిరిస్తున్నడు అందుకే  అటాక్ జేశ్న…తెలంగాణ వచ్చినప్పటి నుంచే అటాక్ చెయ్యాలని చూశ్న కానీ కుదరలేదు. నువ్వు ఎవ్వని గురించి మాట్లాడుతున్నవ్ రా అని అడ్గిన అటాక్ చేశ్న. తెలంగాణ భాషకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే కొట్టినా..’’