విజయవాడలో బైక్ బ్యాటరీ పేలి.. వ్యక్తి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో బైక్ బ్యాటరీ పేలి.. వ్యక్తి మృతి

April 23, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో శుక్రవారం ఘోర విషాదం జరిగింది. పైసా పైసా కూడబెట్టి, ఎంతో ఆశగా శుక్రవారం ఎలక్ట్రిక్ బైక్‌ను కొంటే, శనివారం ఉదయం భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయి ఇల్లు మొత్తానికి మంటలు అలముకున్నా సంఘటన కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. సూర్యారావుపేటోలని గులాబీపేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి శుక్రవారం కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. బైక్ బ్యాటరీకి రాత్రి బెడ్రూంలో చార్జింగ్ పెట్టి, కుటుంబం మొత్తం నిద్రపోయారు. ఏ సమస్య వచ్చిందోగానీ తెల్లవారుజామున భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఇల్లంతా మంటలు అలముకోవడంతో శివకుమార్, అతడి భార్యా పిల్లలు భయంతో కేకలు వేశారు.

వెంటనే పక్కనున్న ఇంటివారు అప్రమత్తమై, మంటల్లో ఇరుక్కున్న కుటుంబాన్ని రక్షించారు. తీవ్రగాయాలైన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శివకుమార్ మ‌‌ృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.