నడుపుతున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

నడుపుతున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు.. వీడియో వైరల్

June 2, 2022

 

ఆఫీస్ నుంచి ఇంటికి బైక్‌పై వెళుతున్న అరుణ్ రామలింగం బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలియని ఆయోమయంలో మంటలు తనకూ అంటుకున్నాయి. వెంటనే బైక్ పై నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చెన్నైలోని మండవెల్లి సమీపంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేలోపే వాహనం పూర్తిగా దగ్ధమైంది.

https://www.indiatoday.in/cities/chennai/story/bike-catches-fire-chennai-rider-escapes-minor-injuries-1957315-2022-06-02?jwsource=cl

ఈ ఘటన ఆ మార్గంలో వెళ్లే వారిలో భయాన్ని కలిగించింది. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అవాంతరం ఏర్పడింది. గత నెల మే లో కూడా ఏపీలో ఇలాంటి ఘటనే జరిగింది. అనంతపురం పట్టణంలో రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనం సైతం అగ్నికి ఆహుతి అయింది. ఆలయం ముందు పార్క్ చేసి ఉండగా ఒక్కసారిగా బ్లోఅవుట్ మాదిరిగా పేలుడు జరిగి వాహనం కాలిపోయింది. కొత్తగా కొనుగోలు చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనంతో రవిచంద్ర అనే వ్యక్తి కర్ణాటకలోని మైసూర్ నుంచి గుంతకల్ మండలంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చాడు. 400 కిలోమీటర్ల పాటు నాన్ స్టాప్ గా బైక్ నడుపుకుని వచ్చి, తర్వాత స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.