గాలిలో పల్టీలు కొట్టిన బైక్..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

గాలిలో పల్టీలు కొట్టిన బైక్..వీడియో వైరల్

March 21, 2022

bick

బైక్ రేసింగ్స్ గురించి తెలియని వారుండరు. ఎప్పుడైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ‘రై’ మంటూ ఎదైనా బైక్ స్పీడ్‌గా వెళ్తే, చాలా భయపడుతాం. అలాంటిది ఓ రేసర్ తన బైక్‌తో ఏకంగా గాలిలోనే పల్టీలు కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు గాలిలో పల్టీలు కొట్టాడు? అనే వివరాల్లో వెళ్తే.. ఇండోనేషియన్‌ మోటోగ్రాండ్‌ ప్రీ తుదిపోరుకు ముందు మార్క్‌ అనే రేసర్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే, అతడు రేసింగ్‌ ట్రాక్‌పై స్కీడ్‌ అయి పడిన తీరు.. ప్రతి ఒక్కరినీ షాక్‌ గురి చేస్తోంది. బైక్‌తో పాటు గాల్లోనే పల్టీలు కొట్టాడు. సెవన్త్‌ టర్న్‌ వద్ద.. బైక్‌ అదుపు తప్పడంతో, పల్టీలు కొడుతూ గాల్లో ఎగిరిపడ్డాడు. బైక్ పార్ట్స్ కూడా చెల్లాచెదురు అయ్యాయి. అయితే, కిందపడిన వెంటనే తేరుకున్న మార్క్‌ పైకి లేచి నెమ్మదిగా నడిచి వస్తూ కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే రేసర్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేని కారణంగా ఆ యాక్సిడెంట్‌ అయిందని తెలుస్తోంది.