వీరయ్య ప్రత్యేకత.. 130 బైకులు.. అన్నీ ఒక కంపెనీవే.. - MicTv.in - Telugu News
mictv telugu

వీరయ్య ప్రత్యేకత.. 130 బైకులు.. అన్నీ ఒక కంపెనీవే..

September 12, 2019

Visakhapatnam.

విశాఖపట్నంలో ఆరుబయట బైకులు నిలపాలంటే ప్రజలను భయపడిపోయేలా చేసిన మోస్ట్ వాంటెడ్ దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆరు సంవత్సరాల పాటు బైకులను దొంగతనం చేస్తూ వీరయ్య చౌదరీ అనే వ్యక్తి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. హీరో హోండా బైకులను చోరీ చేయడంలో సిద్ధహస్తుడిగా మారి వాటినే దొంగలించే వాడు. చాలా కాలం పాటు అతడి కోసం గాలించిన పోలీసులు చివరకు కటకటాల్లోకి నెట్టారు. 

2013 నుంచి వీరయ్య చౌదరి బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నగరంలో పార్కింగ్ ప్రాంతాలు, గ్రామాల్లో బయట నిలిపిన వాటిని చోరీ చేస్తూ చాకచక్యంగా తప్పించుకునేవాడు. ఇప్పటి వరకు మొత్తం 130 వాహనాలు దొంగలించినట్టు తెలిపారు. వీరయ్యతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాడు. 2005లో అతడు ఓ కంప్యూటర్ హార్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ అక్కడ కంప్యూటర్ దొంగలించాడు. తర్వాత జైలుకు వెళ్లి బయటకు వచ్చిన వీరయ్య దొంగతనాన్ని తన వృత్తిగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్టు చెప్పారు.