Biker came to Petrol Bunk and filled petrol by self and gone viral video in Palwancha
mictv telugu

పెట్రోల్ బంకులో యువకుడి పని వైరల్…

August 12, 2022

Biker came to Petrol Bunk and filled petrol by self and gone viral video in Palwancha

పెట్రోల్ కోసమని పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ఓ బైకర్ అక్కడ సిబ్బంది కోసం ఎదురు చూశాడు. తన వద్దకు ఎవరూ రాకపోవడంతో తన బైక్‌లో తనే స్వయంగా పెట్రోల్ కొట్టుకున్నాడు. ఆ తర్వాత బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన వెలుగుచూసింది.

సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా రెడ్ షర్ట్ వేసుకున్న ఓ యువకుడు రాత్రి వేళ బంక్ సిబ్బంది, కస్టమర్స్ అక్కడే ఉన్నప్పుడు ఓ పెట్రోల్ బంక్ లోకి ప్రవేశించాడు. పెట్రోల్ ఫిల్ చేయించుకుందామని కొద్దిసేపు అక్కడే సిబ్బంది కోసం వెయిట్ చేశాడు. కానీ ఎవరూ అతని వద్దకు రాలేదు. ఎవరినో పిలిచినట్టు వీడియోలో కనిపించగా.. అప్పటికీ ఎవరూ రాకపోవడంతో తన బైక్ లో తనే పెట్రోల్ ఫిల్ చేశాడు. అందరూ చూస్తుండగానే.. అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పెట్రోల్ చోరీ చేశాడని కొందరు అంటుంటే.. తన వద్దకు ఎవరూ రాకపోవడంతోనే ఇరిటేట్ అయ్యి.. అలా చేసి ఉండొచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.