తోక తొక్కినందుకు సినిమా చూపించిన పాము - MicTv.in - Telugu News
mictv telugu

తోక తొక్కినందుకు సినిమా చూపించిన పాము

December 4, 2019

snake 0002

పాములు పగ పడతాయని.. వాటి జోలికి పోకూడదని పెద్దలు అంటుంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ పాము పగ పట్టి ఓ యువకున్ని రెండు కిలోమీటర్లు వెంటపడి చుక్కలు చూపించింది. జలాన్ జిల్లాలో గుడ్డు పచౌరీ అనే యువకుడు మోటార్ బైక్‌పై వెళ్తూ అనుకోకుండా తాచు పాము తోకను తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. 

snake 0002

తోక తొక్కి పట్టించుకోకుండా వెళ్లిపోతున్న అతణ్ని పాము వెంబడిస్తూ వచ్చింది. దీనిని గమనించిన గుడ్డు.. భయంతో బైక్ స్పీడ్ పెంచాడు. అయినప్పటికీ పాము 2 కిలోమీటర్ల వరకూ వెంబడించింది. చివరికి రోడ్డుపై నుంచి ఎగిరి బైక్‌పై దూకింది. గుడ్డూ కాళ్ల వరకూ చేరుకుంది. దీంతో అతడు బైక్ వదిలేసి పారిపోయాడు. ఇది గమనించి చుట్టుపక్కల ఉన్న జనాలు బైక్ వద్దకు వచ్చారు. అయినా పాము ఏ మాత్రం వెనక్కి  తగ్గలేదు. పగతో రగిలిపోతూ తన దగ్గరకు వస్తున్న వారిపై బుసలు కొట్టింది. అరగంట వరకూ దూరం నుంచి చూసిన జనాలు. అది ఎంతకూ అక్కడినుంచి కదలకపోవడంతో రాళ్లతో కొట్టారు. దీంతో శాంతించిన పాము బైక్ వదిలి వెళ్ళిపోయింది.

snake 0002