హైదరాబాద్‌లో మరో విషాదం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో మరో విషాదం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి

September 21, 2020

bcnc vb

హైదరాబాద్ నగరంలో వరదలు విలయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ మ్యాన్ హోల్ 12 ఏళ్ల చిన్నారి ప్రానాలు బలి తీసుకోగా అలాంటిదే మరో విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. సరూర్‌నగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఇది చోటుచేసుకుంది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అతడు అందులోనే కొట్టుకుపోయాడు. దీంతో అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 

తపోవన్ కాలనీకి చెందిన నవీన్ కుమార్ బైక్‌పై తన ఇంటికి వెళ్తున్నాడు. అప్పటికే వర్షపు నీటితో వరద ఉదృతంగా ఉండటంతో అది దాటే క్రమంలో బైక్ అదుపుతప్పింది. వరద నీటిలో పడిపోవడంతో ఉధృతికి సరూర్‌నగర్ చెరువులోకి కొట్టుకుపోయారు. చెరువులో బురద, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అతడు బురదలోనే కూరుకుపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరగడం పలువురిని కలిచివేసింది. కాగా, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు చుట్టూ  పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.