Home > Featured > డ్రంక్ అండ్ డ్రైవ్ షూటింగ్ చూసి మందుబాబులు పరార్!

డ్రంక్ అండ్ డ్రైవ్ షూటింగ్ చూసి మందుబాబులు పరార్!

bikers  see the drink and drive shooting

సినిమా షూటింగ్ కోసం జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిజం అనుకొని మందుబాబులు పారిపోయిన సంఘటన నిన్న రాత్రి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అది షేక్ పేట నాలా ఏరియా సమయం శనివారం రాత్రి 10 గంటలు.. పోలీసు వేషంలో ఉన్న నటీనటులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. అది చూసిన మందుబాబులు దొరక్కుండా ఉండేందుకు ఎక్కడి వాహనాలు అక్కడే వదిలేసి పరుగులు తీశారు. సాధారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరైనా పారిపోతే వెంటపడి మరీ పట్టుకుంటారు. అక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఇది మందుబాబులను ఆశ్చర్యపరిచింది.

దీంతో కొందరు మందుబాబులు ధైర్యం చేసి ఏం చేస్తారో చూద్దామని పోలీసులవద్దకు వెళ్లారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదేంటీ ఇలా జరుగుతుందని అనుకుంటున్న మందుబాబులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. అది నిజమైన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కావని.. సినిమా షూటింగ్‌లో భాగంగా జరుగుతున్న పరీక్షలని తెలిసింది. దీంతో మందుబాబులకు మతి పోయింది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆర్టిస్టులు డ్రంక్ అండ్ డ్రైవ్ సీన్ చేస్తున్నారు. రోడ్డుపై పోలీసులు వ్యాన్ పెట్టి బ్రీత్ ఎనలైజర్లు పట్టుకుని వాహనాల్లో వచ్చేవారికి పరీక్షలు చేస్తున్నారు. అవి నిజమైన పరీక్షలేమోనని భావించిన కొందరు మందుబాబులు దొరక్కుండా పారిపోయేందుకు అవస్థలు పడ్డారు.

Updated : 18 Aug 2019 6:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top