మీరు కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా ? అది హీరో మోటొకార్ప్ బైక్ కోసమే చూస్తున్నారా ? అయితే తొందరగా షోరూంకి వెళ్లి మీ బైక్‌ను ఇంటికి తెచ్చుకోండి. లేకపోతే మీ జేబు నుంచి మరిన్ని డబ్బులను గుంజేయొచ్చు. వచ్చే నెల నుంచి భారీగా బైక్ ధరలు పెరగనున్నాయి.ఈలోపే బైక్‌ను కొనుగోలు చేస్తే డబ్బులను ఆదాచేసుకోవచ్చు. అదే ఏప్రిల్ నెల వచ్చిందంటే మాత్రం ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. తద్వారా హీరో మోటొకార్ప్ బైక్స్, స్కూటర్ల ధరలు కూడా పైపైకి చేరుతాయి.
ఏప్రిల్ 1 నుంచి బైక్స్, స్కూటర్ల ధరలను పెంచేందుకు హీరో మోటొకార్ప్ రంగం సిద్ధం చేస్తోంది. సుమారు 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు హీరో మోటొకార్ప్ ప్రకటించింది. ఓబీడీ 1కు బదిలీ కావడం ద్వారా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొందని హీరో మొటోకార్ప్ వివరించింది. బైక్ , స్కూటర్ మోడల్, వేరియంట్ ప్రాతిపదికన ధరల్లో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ పేర్కొంది. హీరో మోటొకార్ప్ కంపెనీ బైక్‌లే కాకుండా మిగతా బైక్స్, స్కూటీలు పెరిగ అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరో బైక్ ధరలు పెరిగితే వాటి ఆధారంగా మిగతా కంపెనీలు కూడా అదే బాటలో పయనించనున్నాయని సమచారం.
ధరల పెంపు నేపథ్యంలో కంపెనీ మాత్రం కస్టమర్లకు ఫైనాన్స్ విషయంలో భరోసా ఇస్తోంది. ఆకర్షణీయ ఫైనాన్స్ సదుపాయం అందిస్తామని పేర్కొంటోంది. అందువల్ల హీరో బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బెనిఫిట్ పొందొచ్చని తెలిపింది.