Bilkis Bano case convicts released due to good behaviour: Gujarat govt to SC
mictv telugu

సత్ప్రవర్తన వల్లే బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల..!

October 18, 2022

బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో 11 మంది ముద్దాయిలను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దోషుల విడుదలకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పద్నాలుగేళ్లు జైలులో గడిపిన బిల్కిస్ బానో దోషులను సత్ప్రవర్తన ఆధారంగానే విడుదల చేశామని, ఇందుకు కేంద్రం సైతం ఆమోదం తెలిపిందని గుజరాత్‌ ప్రభుత్వం నివేదించింది. దోషులు 14 ఏళ్ల శిక్షను పూర్తి చేసుకోవడం, సత్ప్రవర్తన కారణంగానే వారిని విడుదల చేసినట్టు తెలిపింది. ఇందుకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలుపుతూ జులై 11న లేఖ రాసిందని వివరించింది. ఈమేరకు సోమవారం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. దోషుల ముందస్తు విడుదలను సీబీఐతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి తీవ్రంగా వ్యతిరేకించినా.. కేంద్రం అనుమతి ఇచ్చినట్టు వెల్లడయ్యింది. కేవలం రెండు వారాల్లో విడుదలకు అనుమతి ఇచ్చిందని ఈ మేరకు సుప్రీంకోర్టులో గుజరాత్‌ ప్రభుత్వం సోమవారం దాఖలు చేసిన తన అఫిడ్‌విట్‌లో పేర్కొంది.