Viral Post: ఆటో నడిపిన బిల్ గేట్స్..ఆనంద్ మహేంద్ర రియాక్షన్ చూడండి..!! - Telugu News - Mic tv
mictv telugu

Viral Post: ఆటో నడిపిన బిల్ గేట్స్..ఆనంద్ మహేంద్ర రియాక్షన్ చూడండి..!!

March 7, 2023

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కిచిడీ వండి సందడి చేశారు. తాజాగా ఆటో నడుపుతూ హల్ చల్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖవ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్వయంగా షేర్ చేశారు. అంతేకాదు తన రియాక్షన్ కూడా ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ …ఆనంద్ మహీంద్రాతో భేటీ అయ్యారు. గేట్స్ తో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. వారిద్దరూ హర్వర్డ్ యూనివర్సిటీలో క్లాస్ మేట్స్ అని చెప్పారు. ఇప్పుడు బిల్ గేట్స్ తాను మహీంద్రా ట్రియోను నడుపుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇది ఈవీ ఆటో రిక్షా. ఇది 131 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంట్లో నలుగురు ప్రయాణించవచ్చు. ఈ ఆటో రిక్షను చూసి గేట్స్ ఫిదా అయ్యారు. ఇన్నోవేషన్ పట్ల భారత్ అభిరుచి ఎప్పటికీ విస్మయపరచదు. నేను ఈవీ రిక్షాను నడిపాను. మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమను డీకార్బనైజేషన్ చేయడంలో దోహదపడడం స్ఫూర్తిదాయకంగా ఉందని,” గేట్స్ రాశారు.

ఈ వీడియోకు ఆనందర్ మహీంద్ర రియాక్షన్ ఇచ్చారు. చల్తీకా నామ్ బిల్ గేట్స్ గాడీ అంటూ ఓ హిందీ పాటను ట్యూన్ చేశారు.