మైక్రోసాఫ్ట్ అధినేత బిట్ గేట్స్ 72ఏళ్ళ వయస్సులో మళ్లీ ప్రేమలో పడ్డారు. ఒరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో భార్యతో బిల్ గేట్స్ డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గేట్స్…పౌలా హార్డ్ తో కల్సి జనవరిలో ఆస్ట్రేలియాలో ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ కు హాజరయ్యారట. వీరిద్దరూ ఏడాది నుంచి డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని వారి ఫ్రెండ్స్ కూడా ధ్రువీకరించారు.
ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఓరాకిల్ కంపెనీ సీఈవో భార్య…తన భర్త 2019లో అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఇటు బిల్ గేట్స్ కూడా తన భార్య మెలిండాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి 27ఏళ్ల వైవాహిక జీవితానికి 2021 మే నెలలో ముగింపు పలికారు.