మహేశ్ బాబుకు అరుదైన గౌరవం.. ఫాలో అవుతున్న శ్రీమంతుడు - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్ బాబుకు అరుదైన గౌరవం.. ఫాలో అవుతున్న శ్రీమంతుడు

July 1, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేశ్, ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను సతీ సమేతంగా కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సంచలన విషయం వెలుగుచూసింది. మహేశ్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బిల్ గేట్స్ ఫాలో అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బిల్ గేట్స్‌ను ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం కేవలం 71 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో మన మహేశ్ బాబు ఉండడం గమనార్హం. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా, మహేశ్ నటించే సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులు ఎంతోమంది చూస్తారు. మన దేశంలోనే చాలా రాష్ట్రాల్లో అభిమానులు కాకుండా బ్యూరోక్రాట్స్, సామాజిక మేధావులు, రాజకీయ విశ్లేషకులు అనేక మంది భాష అర్ధం కాకున్నా మహేశ్ సినిమాలను చూస్తారు. సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు ముఖ్యంగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట చిత్రాలు కంటెంట్ పరంగా ఎంతో పేరు సంపాదించాయి.