ప్రధానిమోదీతో బిల్ గేట్స్ సమావేశం..భారత్ పురోగతిపై ప్రశంసలు..!! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధానిమోదీతో బిల్ గేట్స్ సమావేశం..భారత్ పురోగతిపై ప్రశంసలు..!!

March 4, 2023

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ సహావ్యవస్థాపకులు బిల్ గేట్స్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత్ తోపాటుగా ప్రపంచవ్యాప్తంగా అసమానతలు తగ్గించడంలో సైన్స్, ఆవిష్కరణలు ఏవిధంగా సహాయపడతాయనే దాని గురించి మాట్లాడుకున్నారు. భారత పర్యటన, మోదీతో భేటీకి సంబంధించిన వివరాలను బిల్ గేట్స్ తన బ్లాగ్ లో షేర్ చేశారు. తాను ఈవారంతో భారతదేశంలో ఉన్నట్లుగా చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఇతర కీలకమైన రంగాల్లో భారత్ లో జరుగుతున్న వినూత్న పని గురించి తెలసుకున్నాని తెలిపారు.

కాగా శుక్రవారం మోదీతో భేటీ అవడం తన పర్యటనలో ప్రధానాంశమన్నారు. భారత్ జీ 20 ప్రెసిడెన్సీ గురించి చర్చించినట్లు చెప్పారు. ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం వంటి రంగాలలోభారత్ సాధిస్తున్న పురోగతిని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఆవిష్కరణలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఏం సాధ్యమవుతుందనేది భారత్ చూపుతోందన్నారు. పురోగతి గురించి మోదీతో తన సంభాషణ గతంలో కంటే మరింత ఆశాజనంగా ఉందని చెప్పారు. మనం ఇన్నోవేషన్ లో పెట్టుబడులు పెడితే ఏ్ం సాద్యమో భారత్ చూపిస్తోందన్నారు. భారత్ ఈ పురోగతిని కొనసాగిస్తుందని దాని ఆవిష్కరణలతో ప్రపంచంతో పంచుకోవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుందని చెప్పడానికి తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ పర్యటనలో ఇతర విశేషాలను కూడా షేర్ చేసుకున్నారు గేట్స్ .