మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్.. ఇకపై  - MicTv.in - Telugu News
mictv telugu

మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్న బిల్ గేట్స్.. ఇకపై 

March 14, 2020

Bill gates.

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ చరిత్రలో కీలకఘట్టం ముగింది. వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంస్థ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. ఇకపై ఆయన మైక్రోసాఫ్ట్‌కు కేవలం సలహాదారుగా మాత్రమే ఉంటారు. బిల్ తప్పుకోవడంతో బోర్డులో 12 మంది ఉంటారు. ఈ పదవితోపాటు వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా బిల్ వైదొలగారు. కొన్నాళ్లు సామాజిక సేవల్లో చురుగ్గా ఉన్న బిల్ ఇకపై తన సమయాన్ని దానికే కేటాయించనున్నారు.

బిల్ 1975లో మైక్రోసాఫ్ట్ ను స్థాపించి అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దారు. ప్రపంచాన్ని కంప్యూటర్లను పరిచయం చేసింది ఆ కంపెనీనే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ నాడిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుతో సంస్థ కోట్లాది కస్టమర్ల అభిమానం చూరగొంది. దీని వెనక బిల్ కృష్టి అవిస్మరణీయం. 2000 సంవత్సరం వరకు సీఈవోగా పనిచేసిన బిల్ 2014లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. లక్షలు కోట్లు సంపాదించిన బిల్ రెండు దశాబ్దాలుగా సామాజిక సేవపై దృష్టి సారించారు. 2000 సంవత్సరంలో భార్యతో కలసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్థాపించారు. పేద దేశాల్లో విద్యా, ఆరోగ్య సదుపాయల కల్పనకు కృషి చేస్తున్నారు.