billgates wife get dating a reportet after divorce
mictv telugu

బిల్ గేట్స్ భార్య అతడితో డేటింగ్ !

November 11, 2022

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దంపతులు కొంతకాలం కిందట విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 27 ఏళ్ల అనుబంధానికి బిల్ గేట్స్-మిలిందా జోడి ముగింపు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. ఎంతో అన్యోన్యంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు చేపట్టిన వీరు విడిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని మిలిందా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా బిల్‌గేట్స్ భార్య కోసం ఓ వార్త వైరల్ అవుతోంది.

58 ఏళ్ల మిలిందా గత కొంతకాలంగా ఓ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. 60 ఏళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జాన్‌డ్యూప్రీతో డేటింగ్ చేస్తున్నారని అమెరికా మీడియా కోడై కూస్తోంది. బిల్‌గేట్స్‌తో విడిపోయాక అతనితో మిలిండా డేటింగ్ చేస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. వారు ఈ మధ్య చెట్టపట్టాలేసుకోని తిరగడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై మిలిందా, జాన్ డ్యూ ప్రీ స్పందించాల్సి ఉంది.