చైనాలోని షాంఘైలో కరోనా షట్డౌన్ వల్ల టెస్లా కంపెనీకి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో మస్క్ ఈ ఆరోపణలు చేశారు. చైనా వైఖరి వల్ల బెర్లిన్, ఆస్టిన్లలో ఉన్న ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఘోరంగా తగ్గిపోయిందని వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు మంటల్లో కాలిపోతోందని పేర్కొన్నారు. తన కార్లకు అవసరమయ్యే బ్యాటరీల ఉత్పత్తికి దోహదపడే సామాను అంతా చైనా పోర్టులో ఇరుక్కుపోయాయని ఆరోపించారు. అటు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసే షాంఘై ప్లాంటు కరోనా కారణంగా మూసేయాల్సి పరిస్థితులు ఉండడంతో తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని కారణం వివరించారు. అంతేకాక, గత రెండేళ్లుగా సప్లై చెయిన్ సమస్యలను ఎదుర్కొంటున్నాం. అయినా దివాళా తీయకుండా కార్ల తయారీని కొనసాగిస్తున్నాం. ఇన్ని కష్టాల నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వగలం? అని ప్రశ్నించారు.