Bimbisara first day collections at boxoffice
mictv telugu

బాక్సాఫీసుపై ‘బింబిసారుడి’ దాడి.. ఫస్ట్‌డే రాబడి ఇదీ

August 6, 2022

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన తాజా చిత్రం బింబిసార. శుక్రవారం రిలీజయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 6.30 కోట్లు వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇందులో షేర్ రూ. 7.27 కోట్లుగా నమోదైంది. విడుదలకు ముందు రూ. 15.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ సాధించిన ఈ చిత్రం త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఏరియాల వారీగా చూస్తే నైజాం రూ. 2.15 కోట్లు, సీడెడ్ రూ. 1.29 కోట్లు, ఈస్ట్ రూ. 43 లక్షలు, వెస్ట్ 36 లక్షలు, ఉత్తరాంధ్ర 90 లక్షలు, గుంటూరు 54 లక్షలు, కృష్ణా 34 లక్షలు, నెల్లూరు 26 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 0.32 లక్షలు, ఓవర్సీస్ రూ. 65 లక్షలు వసూలు చేసింది. ఇక 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని బిజినెస్‌లు కలుపుకొని లాభాల బాటలో పయనించడం ఖాయంగా తెలుస్తోంది. కాగా, సినిమా సక్సెస్ అవడంతో రెండో భాగం ఇంతకు మించి ఉండేలా తీస్తానని కళ్యాణ్ రామ్ ఇప్పటికే హామీ ఇచ్చాడు.